ఈనాం భూముల శాపం: దక్కని పెట్టుబడి సాయంతో అన్నవరం రైతుల ఆవేదన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నా రెవెన్యూ రికార్డుల్లో ఈనాం భూములుగా నమోదు కావడంతో నెల్లూరు జిల్లా జలదంకి మండలం అన్నవరం పరిధిలోని దాసరి అగ్రహారం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాత సుఖీభవ సాయంతో పాటు రాయితీ ఎరువులు అందక, భూములు అమ్ముకోలేక తాము పడుతున్న గోడును రైతులు వెళ్లబోసుకున్నారు. ఈనాందారుల వారసులు సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నారని, అధికారులు స్పందించి హక్కులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.