ఇండియా కే టాప్ వన్ పర్సెంట్ షో మొదటి విజేతగా బిజల్ షా
రిపోర్టర్: సునీల్
స్థలం: India
అనిల్ కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇండియా కే టాప్ వన్ పర్సెంట్ షో గ్రాండ్ ప్రీమియర్ లో బిజల్ షా చారిత్రాత్మక విజయం సాధించి తొలి విన్నర్ గా నిలిచారు. ఈ షో మొదటి ఎపిసోడ్ లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె రూ. 94 లక్షల భారీ నగదు బహుమతిని గెలుచుకున్నారు. తన భర్త నీలయ్ మెహతాతో కలిసి గేమ్ లోకి అడుగుపెట్టిన బిజల్ షా, చివరి వరకు ప్రశాంతంగా ఉంటూ సరైన నిర్ణయాలతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.