తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
మురసు తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం మనమిత్ర వాట్సప్ నంబర్ తో పాటు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.