ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘాన్ని నిలదీసిన బొంబాయి హైకోర్టు ధర్మాసనం
రిపోర్టర్: సురేష్
స్థలం: గోవా
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని బొంబాయి హైకోర్టు గోవా ధర్మాసనం తీవ్రంగా నిలదీసింది. అర్హులైన పౌరులను సాంకేతిక కారణాలతో జాబితా నుంచి తొలగించడంపై న్యాయమూర్తులు అమిత్ ఎస్ జమ్సాండేకర్, వాల్మీకి మెనెజెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చిరునామాకు మారిన కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, పౌరులకు ఎటువంటి చట్టపరమైన ప్రత్యామ్నాయం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోర్టు స్పష్టం చేసింది.