రాయపర్తి మండల వ్యవసాయ అధికారి వాట్సాప్ హ్యాక్ చేసి లక్ష మోసం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా రాయపర్తి మండల వ్యవసాయ అధికారి వీరభద్రం వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆసుపత్రిలో ఉన్నానంటూ బంధువులు, రైతులకు మెసేజ్ పంపి సుమారు లక్ష రూపాయలు కాజేశారు. బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.