తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో కేంద్ర బృందాల పర్యటన: దెబ్బతిన్న పంటల పరిశీలన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాకినాడ
కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్ లో అర్నబ్ తుపానుతో దెబ్బతిన్న పంటలను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం ఆదివారం పరిశీలించిందని అధికారులు తెలిపారు. తాళ్లరేవు మండలంలోని పోలేకుర్రులో నీట మునిగిన వరి పొలాలను వారు పరిశీలించి రైతుల ఆవేదనను తెలుసుకున్నారు. పంటనష్టం గణనను ఈ నెల ఆరో తేదీ లోగా పూర్తి చేసి తుది జాబితాను సమర్పించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు.