మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలంటూ పద్మావతి డిమాండ్
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
బొబ్బిలిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం. పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, రెండున్నర ఏళ్లు గడిచినా అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పాత బకాయితో సహా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.