విజయ్ తలపతి కౌగిలికోసం ఢిల్లీ రోడ్డుపై బైఠాయించిన మహిళ
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి వచ్చి కౌగిలించుకునే వరకు కదిలేది లేదంటూ ఒక మహిళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఘటన కలకలం రేపింది. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్న ఆ మహిళను అక్కడి నుంచి పంపించేందుకు మహిళా పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.