రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏఈఈ నియామక పరీక్ష స్కోరు విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామకాల కోసం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్కోరు మరియు తుది కీని విద్యుత్ శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల స్కోరు జాబితా, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా త్వరలోనే ఒకటి నిష్పత్తిలో తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు త్వరలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.