'అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుంటారుా?.. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడింది. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగిస్తున్నారంటూ రేవంత్ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.