పోలీసుల తీరుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా గన్నవరంలో పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసరపల్లిలో వినాయక మండప ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హత్యలు జరుగుతున్నా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం లేదని, ఎస్పీ తీరుపై డీజీపీకి, సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.