తుర్కియేలో నోవా నౌక ఆచూకీ కోసం లోతైన తవ్వకాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Ağrı

తుర్కియేలోని మౌంట్ అరాత్ సమీపంలో ఉన్న దురుపినార్ శిలల నిర్మాణం వద్ద పరిశోధకులు లోతైన తవ్వకాలు చేపడుతున్నట్లు పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ జెంకర్ అతిలా వెల్లడించారు. ఇది బైబిల్లో పేర్కొన్న ప్రాచీన నోవా నౌక కావచ్చుననే కోణంలో దశాబ్దాలుగా చర్చ జరుగుతోందని తెలిపారు. భూగర్భ రాడార్లు, ప్రత్యేక రోబోట్ల సహాయంతో 18 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ నిర్వహిస్తూ శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.