కోస్ట్ టూ కోస్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలన్న మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గాంధీనగర్
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ గాంధీనగర్‌లో భేటీ అయ్యారు. కోస్ట్ టూ కోస్ట్ వాణిజ్య కారిడార్ ఏర్పాటును పరిశీలించాలని ఆయన కోరారు. విశాఖపట్నం, అమరావతిలో గిఫ్ట్ సిటీ తరహా బిజినెస్ డిస్ట్రిక్ట్‌ల అభివృద్ధికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరడంతో పాటు విజయవాడ ఉత్సవ్, గోదావరి పుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రిని మంత్రి లోకేష్ ఆహ్వానించారు.