టెన్నిస్ బాల్ క్రికెట్ లో ముత్తుకూరు యువకుడి అరుదైన ఘనత
రిపోర్టర్: అశోక్
స్థలం: ముత్తుకూరు
మండలంలోని నక్కలమిట్టకు చెందిన యువ క్రీడాకారుడు ఎల్లసిరి నాగనందీశ్వర్ టెన్నిస్ బాల్ క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని క్రీడా వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైనప్పటికీ, కఠోర సాధనతో తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. 2022లో దిల్లీలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని తన ప్రతిభను చాటుకున్నారని వివరించారు.