పెదవలస ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న సింహాచలం కుమారి

రిపోర్టర్: MADHIRI CHANTIBABU స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదవలస ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లమ్మసింగి సింహాచలం కుమారిని ఎంపిక చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు మండల జడ్పీటీసీ అభ్యర్థి కంకిపాటి గిరి ప్రసాద్ ఆమెకు అధికారికంగా బీ-ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.