యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: International

యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, ఏఐ చాట్‌బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ప్రకటించారు. పిల్లలను ఆన్‌లైన్‌లో రక్షించాల్సిన అవసరం ఉందని, పెద్ద టెక్ కంపెనీల ప్రభావం మార్చడం సాధ్యమేనని ఆమె అన్నారు. 13-15 ఏళ్ల వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో మినీ అకౌంట్లు ప్రతిపాదించారు.