అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన ఆయన, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ అనుసంధానంతో అమరావతిని గ్లోబల్ బయోఎకానమీ పవర్‌హౌస్‌గా మారుస్తామని తెలిపారు. విజయవాడలో రూ.249 కోట్ల వైద్య ప్రాజెక్టులను ప్రారంభించారు.