ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ప్రదర్శన

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఓట్ బచావో దేశ్ బచావో ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎన్నికల విధానాలను తీవ్రంగా నిరసిస్తూ నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సత్తా చాటాయి. వేలాది మంది కార్యకర్తలను సమీకరించి ఢిల్లీకి తరలించడం ద్వారా రేవంత్ రెడ్డి తన నాయనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.