అక్రమ ఆస్తులపై కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

రిపోర్టర్: శివ స్థలం: राजన్న సిరిసిల్ల

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తుల వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడే మాటలు వింటే అబద్ధం కూడా సిగ్గుతో తలవంచుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. త్వరలోనే కేటీఆర్ ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఆధారాలతో సహా బయటపెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.