ఆరోగ్య హెచ్చరిక: మలబద్ధకం లేదా పైల్స్ లక్షణాలను ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
మల విసర్జన సమయంలో కనిపించే రక్తం లేదా పైల్స్ సమస్యను కేవలం వయసు పైబడటం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయరాదని పెల్వినిక్ హెల్త్‌కేర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సందీప్ బెనర్జీ హెచ్చరించారు. ఈ రకమైన లక్షణాలు కేవలం మొలల వల్ల మాత్రమే కాకుండా పెద్దపేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా సంకేతం కావచ్చని, కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.