రాజమహేంద్రవరం పుష్కరాలు: విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: గోపి స్థలం: తూర్పు గోదావరి

రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఎమ్మెల్యే రాజమహేంద్రవరం రూరల్ వెల్లడించారు. భక్తులకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా భవిష్యత్తులో నగరవాసులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.