మీ భూమి-మీ హక్కు: పదహారు లక్షల ఎకరాలపై నిషేధం ఎత్తివేశామన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సురేష్ స్థలం: ప్రకాశం

గతంలో ప్రజల ఆస్తి పత్రాలపై నాయకుల ఫొటోలు వేసుకుని భయపెట్టారని, ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నర్సింగోలులో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నలభై లక్షలకు పైగా రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు. పదహారు లక్షల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించామని, ప్రజల భూసమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు.