యూసీసీపై కేంద్ర ప్రకటన వేళ జేడీయూ కీలక సమావేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: పాట్నా

ఉమ్మడి పౌర స్మృతిపై అమిత్ షా ప్రకటన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 18న పాట్నాలో జరిగే ఈ భేటీలో యూసీసీపై పార్టీ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. వివరాలు పూర్తిగా తెలిశాకే నిర్ణయం తీసుకుంటామని జేడీయూ అంటోంది.