దారుణం: హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కృత్రిమ మేధతో తన చావును సృష్టించిన నిందితుడు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Uttar Pradesh

హత్య కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన మరణాన్ని నాటకమాడిన రాజ్కుమార్ రాజ్భర్ ఉదంతం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. హత్య కేసులో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న నిందితుడు మరణించినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి అరెస్టయ్యాడని అదనపు ఎస్పీ అనూప్ కుమార్ తెలిపారు. మేక కళేబరానికి ఏఐతో తన ముఖాన్ని తగిలించి దహన సంస్కారాలు నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది.