శక్తివంతమైన క్యూ4 గేమింగ్ చిప్తో ఐకూ 16 లాంచ్

రిపోర్టర్: అశోక్ స్థలం: టెక్నాలజీ

చైనాలో ఈ నెల చివరిలో లాంచ్ కానున్న ఐకూ 16 మరియు ఐకూ ప్యాడ్ అల్ట్రా మొబైల్స్కు సంబంధించిన శక్తివంతమైన గేమింగ్ ఫీచర్లను ఐకూ సంస్థ అధికారికంగా వెల్లడించింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ఎస్ఓసీ మరియు స్వయంగా అభివృద్ధి చేసిన క్యూ4 గేమింగ్ చిప్తో ఈ డివైజ్లు రానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ క్యూ4 చిప్ 2కే రిజల్యూషన్, పూర్తి స్థాయి రే ట్రేసింగ్ సపోర్టుతో పాటు క్యూ-ఫ్లెక్స్ కంట్రోల్, మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను కలిగి ఉంటుందని పేర్కొంది.