మేడ్చల్ మల్కాజిగిరిలో ముగిసిన వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ప్రజల స్పందన

రిపోర్టర్: గోపి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మాల్క చెరువు మరియు ఐడీఎల్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు సఫలమయ్యాయని, ప్రజల సహకారంతోనే ఈ వేడుకలు ప్రశాంతంగా సాగాయని వారు తెలిపారు.