సోమశిల జలాశయానికి వరద నీటితో తాగునీటి కష్టాలు తీరాయి

రిపోర్టర్: రమేష్ స్థలం: సంగం

రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా నదికి నీటి రాక పెరగడంతో సోమశిల జలాశయంలో నాలుగు టీఎంసీల నీరు చేరినట్లు తెలుగుగంగ డీఈఈ విజయరామిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాలలో కురిసిన వర్షాల వల్ల జలాశయానికి నీటి ప్రవాహం వచ్చిందని పేర్కొన్నారు. ఈశాన్య రుతుపవనాల రాకతో సమృద్ధిగా వర్షాలు కురిస్తే తొలి పంట సాగుకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.