ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్ లో పతకం సాధించిన జయ్ మీనా

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుడు జయ్ మీనా చరిత్ర సృష్టించారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో ఫిలిప్పీన్స్ కు చెందిన షెర్విన్ నుగిట్ పై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లారు. ఈ విజయంతో సాఫ్ట్ టెన్నిస్ లో భారత్ కు తొలి పతకం ఖాయమైంది. తన అద్భుత ప్రదర్శనతో ఆయన దేశం గర్వపడేలా చేశారు.