భారత హాకీ జెర్సీల రంగుపై మరోసారి వివాదం
రిపోర్టర్: సురేష్
స్థలం: Nagoya
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత హాకీ జెర్సీల రంగుపై మరోసారి గందరగోళం నెలకొంది. సాంప్రదాయ నీలం రంగులోనే జెస్టీలు ఉంటాయని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ స్పష్టం చేసినప్పటికీ, అసలు జెర్సీ ప్రధాన రంగు తెలుపుగా ఉండటం, భుజాలపై నీలం రంగు ఉండటంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ సమయంలో కుంకుమ రంగు జెర్సీలపై విమర్శలు రావడంతో ఈసారైనా నీలం రంగుకే ప్రాధాన్యం ఇవ్వాలని భావించినా, స్పాన్సర్లు మరియు ఐఓఏ ద్వారా వచ్చిన కిట్లలో రంగుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.