తుపాను నష్టాల అంచనాకు ఏపీలో శని, ఆదివారాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించనుందని అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్దాస్ నేతృత్వంలో కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయనున్నారు. తుపాను నష్టంపై శనివారం ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.