ఎమ్మెల్యే ఓటింగ్ లో తీవ్ర నిర్లక్ష్యం: పొరపాటు బూత్ లో ఓటు వేసిన రమేష్‌బాబు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తన ఓటు హక్కును పొరపాటున వేరే బూత్ లో వినియోగించుకున్నట్లు వార్తలు వచ్చాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ 117వ వార్డు ఓటరు అయిన ఆయన, 115వ వార్డులోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పోలింగ్ సిబ్బంది, కూటమి ఏజెంట్లు ఎవరూ గుర్తించకపోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతుండగా, ఎన్నికల సిబ్బంది వైఫల్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది.