మెంకీ స్కాట్ విరాళంతో గృహనిర్మాణ రంగానికి భారీ ఊరట: దశాబ్దపు ప్రణాళిక ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Silicon Valley

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెంకీ స్కాట్ అందజేసిన ముప్ పై మిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు హౌసింగ్ ట్రస్ట్ సిలికాన్ వ్యాలీ సంస్థ దశాబ్దపు ప్రణాళికను ప్రకటించిందని సీఈఓ నోని రామోస్ వెల్లడించారు. ఈ నిధులతో బే ఏరియా వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన గృహాల నిర్మాణాలు చేపట్టడంతో పాటు మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి అండగా నిలవనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.