కరీంనగర్లో అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్
రిపోర్టర్: విజయ్
స్థలం: కరీంనగర్
ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై ఐదు ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ స్వయంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. నూతన భారత్ నిర్మాణమే లక్ష్యంగా మోదీ సాగిస్తున్న నిస్వార్థ సేవలు దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.