కృష్ణా నీటి విడుదలపై డీకే శివకుమార్‌కు రేవంత్ కృతజ్ఞతలు

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు కృష్ణా నటి నీటిని విడుదల చేసేందుకు అంగీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు, పరస్పర సహకారానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.