జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో నరసాపురం విద్యార్థినుల అద్భుత విజయాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 బాలికల అథ్లెటిక్ పోటీల్లో నరసాపురం పాఠశాల విద్యార్థినులు అన్ని విభాగాల్లో విజేతలుగా నిలిచారని ప్రధానోపాధ్యాయులు మధు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులు నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించి, రాజమండ్రిలో జరిగే పోటీల్లోనూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.