సోషల్ మీడియాలో రాజకీయ రంగు పులుముకున్న '80s AI ఫోటో ట్రెండ్'

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న '80s AI ఫోటో ట్రెండ్' రాజకీయ వివాదానికి దారితీసింది. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తమ AI రెట్రో లుక్స్ షేర్ చేయగా, ఎంపీ రేణుకా చౌదరి మాత్రం తన ఒరిజినల్ సావీ మ్యాగజైన్ కవర్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, కేరళ కాంగ్రెస్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిన వెటకారపు AI ఫోటో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.