తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చొక్కాలతో నిరసన తెలుపుతున్న హరీశ్ రావు, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. గేటు వద్ద జరిగిన తోపులాటలో హరీశ్ రావు, జగదీష్ రెడ్డి కిందపడిపోయారు. ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.