విద్యార్థులకు అలర్ట్: నేటితో ముగియనున్న క్యాట్ దరఖాస్తుల సవరణ గడువు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న క్యాట్ 2026 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సవరణ గడువు నేటితో ముగియనుందని పరీక్ష నిర్వహాక అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులలోని ఫోటో, సంతకం మరియు పరీక్ష కేంద్రాల ప్రాధాన్యతలను సాయంత్రం ఐదు గంటలలోపు సరిదిద్దుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొరపాట్లను సవరించే అవకాశం ఉండదని, అభ్యర్థులు వెంటనే ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.