బీసీలకు రిజర్వేషన్లు ఖరారు: ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: బాపట్ల

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనిమిది కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ చంద్రబాబు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే వెల్లడించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ వార్డు మెంబర్లలో 27.95 శాతం, సర్పంచుల్లో 25.55 శాతం, ఎంపీటీసీల్లో 24.60 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారికంగా ఆమోద ముద్ర వేశారని తెలిపారు.