బీసీ విద్యార్థులకు తీపి కబురు: ఓవర్సీస్ విద్యానిధి గడువు పెంపు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఇరవై లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.