టీడీపీ కార్యాలయ వాతావరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యాలయ పరిసరాలు, గ్రీనరీ, నెట్‌జీరో విధానం చాలా బాగున్నాయని కొనియాడారు. దీనికి కారకుడైన నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఆహార వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేసి మొక్కలకు ఉపయోగించాలని నేతలకు సూచించారు.