విశ్రాంత ఉద్యోగి ప్రభుత్వ సొమ్ము కాజేయడానికి విఫలయత్నం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
వ్యవసాయశాఖలో రూ.29.80 లక్షల ప్రభుత్వ సొమ్మును కొట్టేయడానికి రిటైరైన తొమ్మిదేళ్ల తర్వాత విశ్రాంత సంయుక్త సంచాలకుడు పన్నిన కుట్ర భగ్నమైంది. 26 ఏళ్ల కిందటి పాత బ్యాంకు ఖాతా వివరాలతో నగదు విత్‌డ్రా చేయడానికి యత్నించగా, బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని పట్టించారు. ఈ ఘటన వ్యవసాయశాఖలో తీవ్ర కలకలం రేపింది.