గిరిజనులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కంచర్ల రామకృష్ణారెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: యాదాద్రి భువనగిరి
గిరిజనుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, పోడు భూములపై హక్కులు కల్పించడంలోనూ, కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలోనూ పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు.