అమరావతి ఓఆర్‌ఆర్‌కు ఫ్లైయాష్ ఉచిత సరఫరాకు ఏపీ ప్రభుత్వం అంగీకారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరమైన 1.39 కోట్ల క్యూబిక్ మీటర్ల ఫ్లైయాష్‌ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, రవాణా భారం కింద రూ.470 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు లేఖ రాసింది. కేంద్ర ఆమోదం లభిస్తే ఒకట్రెండు నెలల్లోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.