విద్యార్థినులకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పించి ధైర్యం నూరిపోసిన పోలీసులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మల్కాజ్గిరి పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ధీర కార్యక్రమం నిర్వహించారు. డీసీపీలు అనురాధ, ఉషారాణి సహా పలువురు అధికారులు ఏడు వందల మంది విద్యార్థినులకు మహిళా భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్ నివారణపై అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆత్మరక్షణ మెళకువలు నేర్పించి పోలీసుల భరోసా కల్పించారు.