గుర్గావ్‌ హిట్ అండ్‌ రన్: హంతకులు కావాలనే ఢీకొట్టారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Haryana

గుర్గావ్‌ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. నిందితులు తనను వెంబడించి, కావాలనే కారుతో గుద్దారని బాధితురాలు సియా ఆరోపించారు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్యాయత్నమని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. గాయపడిన సియా ఢిల్లీ ఆసుపత్రిలో ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ పరీక్షలు చేయించుకోనున్నారు. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.