అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం అబ్బరాజలెం వద్ద పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నూతన వైద్య ప్రాంగణం ద్వారా సుమారు మూడు లక్షల మందికి అధునాతన కంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన సోమవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.