గ్లోబల్ చెస్ లీగ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌కు వరుస పరాజయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
గ్లోబల్ చెస్ లీగ్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు నిరాశ ఎదురైంది. ఒకే రోజు రెండు మ్యాచ్‌లలో ఆయన ఓటమి చవిచూశారు. ఇయాన్ నెపోమ్నియాట్చితో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆనంద్, ఆ తర్వాత 20 ఏళ్ల జావోఖిర్ సిందరోవ్ చేతిలోనూ పరాజయం పాలయ్యారు. సమయం ముగియడం మరియు వ్యూహాత్మక తప్పిదాల వల్లనే తాను ఓడిపోవాల్సి వచ్చిందని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.