కర్నూలు వినాయక ఘాట్ రూపురేఖలు పూర్తిగా మార్చేసిన యంత్రాంగం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ ప్రాంతం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఎప్పుడూ చెత్తాచెదారంతో అధ్వానంగా ఉండే ఈ ప్రాంతాన్ని అధికారులు అత్యంత సుందరంగా అభివృద్ధి చేశారు. ఈ మేరకు మంత్రి టి.జి.భరత్, కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, మున్సిపల్ కమిషనర్ కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెడితే ఎలాంటి మార్పు సాధ్యమో కర్నూలు ఉదాహరణగా నిలిచింది.