చిల్లర వివాదం: బస్సు నుంచి తోసేయడంతో మహిళా కండక్టర్ మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిట్టగూడెం ప్రాంతంలో చిల్లర డబ్బుల వివాదం కారణంగా మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళికను ప్రయాణికురాలు బస్సు నుంచి తోసేశారు. తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని తోటి ఆర్టీసి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులను నిలిపివేశారు.